బీమా పాలసీ క్లెయిమ్‌ కాలేదా? ఈ స్టోరీ చదవండి

  ఆపద సమయంలో ఆదుకుంటుందన్న భరోసాతో  బీమా (ప్రభుత్వ, లేదా ప్రైవేటు)  పాలసీ తీసుకునే  భారీ నిరాశ ఎదురయ్యే ఉదంతాలు చాలా చూశాం. ఇలాంటి ఘటనలో న్యాయ పోరాటం చేయడం కూడా చాలా అరుదు. కానీ ఒక పాలసీదారుని భార్య మాత్రం ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)పై పోరుకు దిగారు. చట్టపరంగా తనకు దక్కాల్సిన పాలసీ సొమ్ముపై జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ)ను ఆశ‍్రయించి విజయం సాధించారు.