బిగ్‌బాస్ తెలుగు 3.. అందులో పాల్గొన్న కంటెస్టెంట్లకు ఎంతగానో క్రేజ్ తెచ్చిపెట్టింది. చాలామందికి అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇక రాహుల్ చేజారిన రాములో రాములా పాట మరోసారి అతనితో పాడించాలని ఆయన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ప్రస్తుతం రాహుల్.. ఆర్‌ఎక్స్100 ఫేమ్ హీరో కార్తీకేయ నటిస్తున్న 90 ఎమ్‌ఎల్ చిత్రంలో 'సింగిల్ సింగిల్' పాడారు. దీనికి యూట్యూబ్‌లో మంచి ఆదరణే లభిస్తోంది. అలా బిగ్‌బాస్ విజేత రాహుల్ వరుస ఇంటర్య్వూలు, పాటలతో బిజీ అయిపోయాడు. కాగా మరోవైపు బిగ్‌బాస్ పార్టిసిపెంట్లు రీయూనియన్ పేరిట గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. కలర్‌ఫుల్ డ్రెస్సులతో మాంచి కిక్ ఇచ్చే పార్టీ నిర్వహించుకున్నారు. ఇందులో హిమజ, మహేశ్, పునర్నవి, వరుణ్, వితిక, అలీ, అతని భార్య మసుమా హాజరయ్యారు. కేక్ కటింగ్‌లు, డ్యాన్సులు, ఫొటోలకు ఫోజులు.. అబ్బో చాలానే ఎంజాయ్ చేశారు.
బిగ్‌బాస్ రీయూనియన్: రాహుల్ ఏమయ్యాడు?